Rahul Sipligunj: అసలు రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది: శ్రీముఖితో రాహుల్ సిప్లిగంజ్ సెల్ఫీ

  • ఇటీవలే ముగిసిన బిగ్ బాస్-3
  • విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్
  • ఆసక్తి కలిగించిన శ్రీముఖితో వివాదాలు
ఇటీవల ముగిసిన బిగ్ బాస్-3 రియాల్టీ షో అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికగా నిలిచింది. పునర్నవి-రాహుల్ సిప్లిగంజ్ మధ్య అనుబంధం ఎంత రక్తికట్టించిందో, రాహుల్ సిప్లిగంజ్-శ్రీముఖి మధ్య పోరు అంతే ఆసక్తి కలిగించింది. అనేక వాదోపవాదాలతో బిగ్ బాస్ ఇంటిని రాహుల్, శ్రీముఖి వేడెక్కించారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఓ దశలో ఇద్దరి మధ్య మనస్పర్థలు హెచ్చుస్థాయికి చేరాయి. బిగ్ బాస్ ఇంట్లో పరిస్థితులు వారి మధ్య వివాదాలకు కారణం అయ్యాయి. అయితే, ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

"అసలు రిలేషన్ ఇప్పుడే మొదలైంది" అంటూ రాహుల్ పోస్టు చేసిన సెల్ఫీ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. శ్రీముఖి కూడా ఇదే ఫొటోను పోస్టు చేసింది. దీనికి "గతం గతః" అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. మొత్తమ్మీద వాళ్లిద్దరూ బిగ్ బాస్ ఇంట్లో వివాదాలను అక్కడే వదిలేసి వచ్చినట్టు తాజా పిక్ చెబుతోంది. ఈ షోలో రాహుల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. విన్నర్ అవుతుందనుకున్న శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Rahul Sipligunj
Sreemukhi
Bigg Boss-3
Andhra Pradesh
Telangana

More Telugu News