YSRCP: పార్లమెంటులో 3 బిల్లులు ప్రవేశపెట్టిన విజయసాయిరెడ్డి

  • రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లులు
  • జాతీయ రైతు కమిషన్ ఏర్పాటుపై తొలి బిల్లు
  • 3 బిల్లుల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో 3 మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. మొదటగా ‘జాతీయ రైతు కమిషన్’ ఏర్పాటు చేయాలంటూ కోరారు. జాతీయ స్థాయిలో రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే కమిషన్ రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం చేసే సూచనలు, ఇచ్చే సలహాలను రాష్ట్రాలు పాటిస్తున్నాయా? లేదా? అని పర్యవేక్షించే అధికారం కూడా కమిషన్ కు ఉండేలా పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన కోరారు.

న్యాయవాదుల సామాజిక భద్రత కోసం 1961లో రూపొందించిన అడ్వకేట్స్ చట్టానికి సవరణలు చేయాలని, న్యాయవాదుల సామాజిక నిధిని కేంద్రం ఏర్పాటు చేయాలని రెండవ బిల్లును ప్రవేశ పెట్టారు. ఇక మూడవ బిల్లుగా మహిళలపై దాడి చేసి వారి ఆభరణాలను ఎత్తుకెళ్లే వారిని కఠినంగా శిక్షించటానికి 1961 నాటి చట్టాన్ని సవరించాలని కోరారు. దీని వల్ల చైన్ స్నాచింగ్ లతో పాటు ఇతర దొంగతనాలు కూడా తగ్గుముఖం పడతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
YSRCP
mp
Vijayasaireddy
Rajyasabha

More Telugu News