యూఎస్ లో ఉబర్ వాహనాల్లో పెరిగిన లైంగిక దాడులు
- 2018లో అత్యాచారానికి గురైన వారి సంఖ్య 235
- 2017లో ఈ బాధితుల సంఖ్య 229
- బాధితుల్లో మహిళా డ్రైవర్లూ కూడా..
ఉబర్ సంస్థ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. ఈ రెండు సంవత్సరాలకు గాను తమ వాహనాల్లో జరిగిన లైంగిక దాడులు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు వంటి దుర్ఘటనల సమాచారాన్ని వెలువరించింది. లైంగిక దాడులు జరిగినట్టు ఆరోపించిన వారిలో మహిళా డ్రైవర్లు కూడా వుండడం విశేషం. ఇదిలా ఉండగా, ఉబర్ వాహనాల్లో చనిపోయిన వారి సంఖ్య 2017 లో పది ఉండగా, 2018లో ఆ సంఖ్య తొమ్మిదిగా ఉందని నివేదిక పేర్కొంది.