Sajjanar: సజ్జనార్ ఫొటోకు క్షీరాభిషేకం... తెలంగాణ పోలీసులపై ప్రశంసల వెల్లువ

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
  • సజ్జనార్ ను హీరోగా కీర్తిస్తున్న ప్రజలు!
దిశ హత్య ఎంత తీవ్ర స్థాయిలో కలచివేసిందో, ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో అంతకు రెట్టింపు స్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ కౌంటర్ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ హీరో అయ్యారు. ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో సీపీ సజ్జనార్ పేరు మార్మోగుతోంది. తాజాగా, పలు ప్రాంతాల్లో సజ్జనార్ ఫొటోకు పాలాభిషేకాలు నిర్వహించారు. సజ్జనార్ ను కీర్తిస్తూ నినాదాలు చేయడమే కాదు, ఆయన చిత్రపటానికి అభిషేకం చేస్తూ ప్రజలు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Sajjanar
CP
Police
Telangana
Disha

More Telugu News