Roja: నేరం చేస్తే తగిన శిక్ష పడుతుందన్న సంకేతం ఇది: రోజా

  • సంచలనం సృష్టించిన దిశ ఉదంతం
  • నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
  • స్పందించిన రోజా
దిశ ఘటన జరిగిన స్థలానికి సమీపంలోనే నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు కిరాతకులను పోలీసులు మట్టుబెట్టారు. దీనిపై ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్పందించారు. దిశ అత్యాచార ఘటన అత్యంత బాధాకరమైన విషయం అని అన్నారు. తాజా చర్యతో నేరం చేసిన వారికి తగిన శిక్ష ఖాయమన్న సంకేతం ఇచ్చినట్టయిందని అభిప్రాయపడ్డారు. తన నియోజకర్గం నగరిలో అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో మాట్లాడుతూ రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.
Roja
APIIC
Telangana
Disha
Andhra Pradesh
YSRCP
Police

More Telugu News