Balakrishna: భగవంతుడే పోలీసుల రూపంలో ఈ రోజు సరైన శిక్ష విధించాడు: బాలకృష్ణ స్పందన

  • నాన్న గారు అప్పట్లో సందేశాత్మక చిత్రాల ద్వారా మార్పు కోసం ప్రయత్నించారు
  • మహిళలపై దేశ వ్యాప్తంగా ఘోర ఘటనలు జరుగుతున్నాయి
  • తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు అభినందనలు  
దిశపై హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సినీనటుడు బాలకృష్ణ స్పందించారు. దిశపై దుండగుల సామూహిక అత్యాచారం, హత్య ఘటనకు ప్రతిఫలంగా తగిన శిక్ష ఎదుర్కొన్నారని అన్నారు.

సమాజాన్ని మార్చడానికి అప్పట్లో తన తండ్రి నందమూరి తారక రామారావు సినిమాల ద్వారా మంచి సందేశాలను ఇచ్చారని బాలయ్య అన్నారు. తాను కూడా లెజెండ్ వంటి సినిమాల్లో స్త్రీల గొప్పదనాన్ని గూర్చి చెప్పానని తెలుపుతూ ఓ శ్లోకం చదివారు. సందేశాత్మక చిత్రాల ద్వారా ప్రజలను మార్చేందుకు ప్రయత్నించామన్నారు.

మహిళలపై దేశ వ్యాప్తంగా ఘోర ఘటనలు జరుగుతున్నాయని బాలకృష్ణ అన్నారు. భగవంతుడే పోలీసుల రూపంలో ఈ రోజు వారికి సరైన శిక్ష విధించాడని అన్నారు. మరోసారి ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా భగవంతుడే కదిలి వచ్చినట్లుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.
Balakrishna
Disha
Hyderabad

More Telugu News