హైదరాబాద్ పోలీసులకు అభినందనలు: ఢిల్లీ పోలీస్ డిప్యూటీ చీఫ్ సంజయ్ కుమార్

06-12-2019 Fri 12:00
  • దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పై స్పందన 
  • సరైన నిర్ణయమని ట్విట్టర్‌లో వ్యాఖ్య
  • ఆ సమయంలో అంతే చేయగలరు

దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులను రాజకీయ ప్రముఖులే కాదు ఇతర రాష్ట్రాల్లోని పోలీసులు సైతం అభినందిస్తున్నారు. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ సంజీవ్ కుమార్ యాదవ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ పోలీసుల చర్యను అభినందించారు. 

నిందితులు తమపైనే దాడి చేసి తప్పించుకునే ప్రయత్నంలో ఆత్మరక్షణార్థం కాల్పులు జరపడంతో వారు మృతి చెందినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్ కుమార్ స్పందిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. పోలీసుల చర్యను అభినందిస్తున్నానని తెలిపారు.