Police: నిందితులు రాళ్లు రువ్వగా ఇద్దరు పోలీసులకూ గాయాలు... ఆసుపత్రిలో చికిత్స!

  • పోలీసులపై దాడికి దిగిన నిందితులు
  • లొంగిపోవాలన్న హెచ్చరికలు బేఖాతరు
  • తుపాకి కాల్పుల్లో నలుగురూ మృతి
ఈ ఉదయం దిశ హంతకులను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లిన సమయంలో వారు పోలీసులపై దాడికి దిగి పారిపోతుంటే, ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలీసులకూ గాయాలు అయ్యాయి. దిశను కాల్చిన చోటు నుంచి పరుగు ప్రారంభించిన నలుగురు నిందితులూ, అక్కడి దొరికిన రాళ్లను పోలీసులపైకి విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

వారు విసిరిన రాళ్లలో కొన్ని పోలీసులకూ తగిలాయని, గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను వారు పట్టించుకోనందుకే ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందన్నారు.
Police
Encounter
Woonds
Hospital
Disha

More Telugu News