Disha: శభాష్ హైదరాబాద్ పోలీస్: ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా ప్రశంసలు

  • ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు
  • తెలంగాణ పోలీసులకు అభినందనలు
  • ఇతర రాష్ట్రాల పోలీసులు నేర్చుకోవాలి
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న వేళ.. ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా స్పందించారు. తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు. రేపిస్టులతో వ్యవహరించడం ఎలానో తెలంగాణ పోలీసులను చూసి ఇతర రాష్ట్రాల పోలీసులు నేర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌లో ఎన్‌కౌంటర్ వార్తను తన పోస్టుకు జతపరిచారు. ఇటీవలే బీజేపీలో చేరిన మిశ్రా.. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
Disha
Encounter
New Delhi
BJP
Kapil mishra

More Telugu News