Disha: సజ్జనార్ పది కాలాల పాటు చల్లగా ఉండాలి.. ఎన్‌కౌంటర్ విషయాన్ని చాటింపు వేసి చెప్పండి: దర్శకుడు హరీశ్ శంకర్

  • ప్రభుత్వానికి, కమిషనర్‌కు కృతజ్ఞతలు
  • చాటింపు వేసి అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయండి
  • ట్వీట్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్
వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. కమిషనర్ సజ్జనార్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌కౌంటర్ విషయాన్ని చాటింపు వేసి మరీ ఘనంగా ప్రచారం చేయాలని కోరారు. నిందితుల ఎన్‌కౌంటర్ గురించి అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
Disha
encounter
shamshabad
Harish shankar
Tollywood

More Telugu News