Disha: ఎన్‌కౌంటర్ ప్రదేశానికి చేరుకున్న కమిషనర్ సజ్జనార్

  • ఎన్‌కౌంటర్ తీరును పరిశీలించిన కమిషనర్
  • పోలీసుల కస్టడీలోకి వచ్చిన రెండో రోజే ఎన్‌కౌంటర్
  • అధికారికంగా ప్రకటించని పోలీసులు
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేరుకున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును పరిశీలించారు. పరిసరాలను గమనించారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వైద్యురాలిని హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారు తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నిందితులు నలుగురూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్న రెండో రోజే ఎన్‌కౌంటర్ చేయడం గమనార్హం. ఎన్‌కౌంటర్ విషయాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
Disha
Encounter
Sajjanar
shamshabad

More Telugu News