Rashi khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పాట పాడానంటున్న రాశిఖన్నా
  • 'అడవి రాముడు' పూర్తి చేసిన రానా
  • కన్ఫర్మ్ చేసిన వంశీ పైడిపల్లి  
   * తనకు చిన్నప్పటి నుంచీ పాటలు పాడడం అంటే ఇష్టమని అంటోంది కథానాయిక రాశిఖన్నా. 'చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను. స్కూల్లో కూడా పాడేదాన్ని. ఇప్పుడు ఓ సినిమాలో కూడా పాడాను. అది ఏ సినిమా అన్నది ప్రస్తుతం సస్పెన్స్. త్వరలో చెబుతాను' అని చెప్పింది రాశి.

* తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం 'హాథి మేరా సాథి' చిత్రం షూటింగ్ పూర్తయింది. రానా పర్యావరణ కార్యకర్తగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'అడవి రాముడు' పేరుతో విడుదల చేస్తారు.

* ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని చేస్తున్న మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు వంశీ తాజాగా కన్ఫర్మ్ చేశాడు. తన తదుపరి చిత్రం మహేశ్ తో చేస్తున్నానని ఆయన చెప్పాడు. దీనిని దిల్ రాజు నిర్మించే అవకాశం వుంది.
Rashi khanna
Rana Daggubati
Mahesh Babu
Vamsi Paidipally

More Telugu News