Nara Lokesh: నూతనంగా నిర్మితమైన టీడీపీ ఆఫీసులో నారా లోకేశ్, బ్రాహ్మణి పూజలు... ఫొటోలు ఇవిగో!

  • రేపు ప్రారంభోత్సవం జరుపుకోనున్న టీడీపీ ఆఫీసు
  • కార్యాలయంలో హోమం నిర్వహణ
  • కుటుంబంతో వచ్చిన లోకేశ్ 
రేపు ప్రారంభోత్సవం జరుపుకోనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీసమేతంగా పూజలు నిర్వహించారు. శృంగేరీ శారదాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ నిర్వహించారు. ఆపై సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ పాల్గొన్నారు. మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద టీడీపీ కార్యాలయం భారీస్థాయిలో నిర్మితమైంది. డిసెంబరు 6న చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Nara Lokesh
Telugudesam
Office
Telugudesam
Mangalagiri

More Telugu News