Nokia: స్మార్ట్ టీవీ రంగంలో కాలుమోపిన నోకియా

  • 55 అంగుళాల టీవీతో నోకియా ఎంట్రీ
  • ధర రూ.41,999
  • ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు 
మొబైల్ ఫోన్ల తయారీలో తనకంటూ విశ్వసనీయత ఏర్పరచుకున్న నోకియా ఇప్పుడు స్మార్ట్ టీవీ రంగంలో ప్రవేశించింది. డిసెంబరు 10 నుంచి నోకియా స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ లో విక్రయించనున్నారు. ఇది 55 అంగుళాల భారీ స్క్రీన్, 4కే యూహెచ్ డీ ఎల్ఈడీ టెక్నాలజీతో వస్తోంది. దీని ధర రూ.41,999 మాత్రమే. ఇదే మోడల్ ఇతర కంపెనీలవైతే లక్షకు దరిదాపుల్లో ధర పలుకుతున్నాయి. ఈ అత్యాధునిక టెలివిజన్ లో శబ్దనాణ్యతకు కూడా పెద్దపీట వేశారు. దీంట్లో జేబీఎల్ ఆడియో సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. ట్రూ సరౌండ్, డాల్బీ ఆడియో వంటి సౌండ్ ఫీచర్లు ఈ టీవీకి అదనపు ఆకర్షణ. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్-9 ఓఎస్ తో పనిచేస్తుంది.
Nokia
Smart TV
Android
Flipkart

More Telugu News