Chandrababu: ఏ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామన్నా మేము అడ్డుచెప్పం: సోము వీర్రాజు

  • బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఎవరొచ్చినా ఓకే
  • ‘ఓపెన్ ఆఫర్’ ఇస్తున్నాం
  • టీడీపీ నాయకులకు అబద్ధాలు చెప్పడం అలవాటే
అమిత్ షా అంటే తనకు ఇష్టమని చెబుతున్న పవన్ కల్యాణ్, గతంలో అమిత్ షా గురించి ఎవరి దగ్గర ఏం వ్యాఖ్యలు చేశారో ఆయన బయటకు చెప్పాలని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఏ పార్టీ వచ్చినా, విలీనం చేసినా తాము అడ్డుచెప్పమని, ‘ఓపెన్ ఆఫర్’ ఇస్తున్నామని అన్నారు.  

ఏపీకి మట్టి, నీళ్లు తప్ప రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదనంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరచుగా చేసే వ్యాఖ్యలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నాయకులకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం అన్నవి వాళ్ల రక్తంలోనే ఉన్నాయని విమర్శించారు.
Chandrababu
Pawan Kalyan
somu veeraj
Bjp

More Telugu News