Tundupalli: తుండుపల్లి టోల్ గేట్ సమీపంలో దిశ మొబైల్ ఫోన్ ను పాతిపెట్టిన నిందితులు... స్వాధీనం చేసుకున్న పోలీసులు!

  • దిశ నిందితుల నుంచి కీలక సమాచారం
  • సంఘటన స్థలంలో పలు ఆధారాలు లభ్యం
  • లారీ క్యాబిన్ నుంచి బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు సేకరించిన క్లూస్ టీమ్
దిశ నిందితులను పోలీసులు ఇవాళ చర్లపల్లి జైలు నుంచి సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వారు చెప్పిన సమాచారం ఆధారంగా దుప్పటి, అగ్గిపెట్టె, పెట్రోల్ బాటిల్ వంటి కొన్ని కీలకమైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో దిశ మొబైల్ కూడా ఉంది. ఆమె మొబైల్ ను నిందితులు తుండుపల్లి టోల్ గేట్ సమీపంలో పాతిపెట్టగా, పోలీసులు దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, లారీ క్యాబిన్ లోనూ పలు కీలక ఆధారాల కోసం శోధించిన క్లూస్ టీమ్ దిశ బ్లడ్ శాంపిల్స్, తలవెంట్రుకలు స్వాధీనం చేసుకుంది. నిందితుల కస్టడీ మొదటిరోజునే కీలక ఆధారాలు లభ్యం కావడంతో కేసులో పురోగతి సాధ్యమని అధికారులు భావిస్తున్నారు.
Tundupalli
Toll Gate
Hyderabad
Disha
Telangana
Police

More Telugu News