Telangana: తెలంగాణలో నా కంటే సీనియర్ లీడర్ ఎవరూ లేరు: వీహెచ్

  • తప్పకుండా నాకు పీసీసీ పదవి లభిస్తుంది
  • ప్రజల్లోకి వెళ్లే సత్తా నాకు ఉంది
  • విద్యార్థుల డిమాండ్లను కేటీఆర్ పట్టించుకోవట్లేదు
తెలంగాణలో తన కంటే సీనియర్ లీడర్ ఎవరూ లేరని కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. ప్రజల్లోకి వెళ్లే సత్తా తనకు ఉందని, తప్పకుండా తనకు పీసీసీ పదవి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని కేటీఆర్ ఎలా నిందిస్తున్నారో.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు కూడా అన్యాయం జరిగిందని రాష్ట్రంలో విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల డిమాండ్లను అసలు కేటీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Telangana
Congress
pcc
V.Hanumantharao

More Telugu News