KTR: కేంద్రంపై ట్విట్టర్ పిట్ట కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: లక్ష్మణ్

  • కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజంలేదన్న తెలంగాణ బీజేపీ చీఫ్
  • విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపాటు
  • రక్షణశాఖ భూములు ఇవ్వమన్నందుకే ఎదురుదాడి 
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ట్విట్టర్ పిట్టగా అభివర్ణించారు. కేంద్రంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. విభజన రాజకీయాలు చేయడం తండ్రీకొడుకులకు పరిపాటిగా మారిందని అన్నారు. దక్షిణాదిని కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రక్షణశాఖ భూములు కొట్టేయాలన్న టీఆర్ఎస్ ప్లాన్ విఫలమైందని లక్ష్మణ్ పేర్కొన్నారు. భూములు ఇవ్వడం కుదరదన్నందుకే కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంతో ఎదిగిన టీఆర్ఎస్ నేడు తెలంగాణ అస్థిత్వానికే ముప్పులా మారిందని విమర్శించారు.
KTR
KCR
TRS
Lakshman
BJP
Telangana

More Telugu News