Ganta Srinivasa Rao: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై గంటా స్పందన

  • ఇదంతా అసత్య ప్రచారం
  • పార్టీ మారాలనే ఆలోచన నాకు లేదు
  • నేను టీడీపీలోనే ఉంటా

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై గంటా స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమని, పార్టీ మారాలనే ఆలోచనే తనకు లేదని చెప్పారు. తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తమ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గ సమావేశాలను నిర్వహించబోతున్నట్టు తెలిపారు.

గంటా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తొలుత ప్రచారం జరిగింది. అయితే విశాఖ జిల్లాకు చెందిన మంత్రి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారని... దీంతో, ఆ ప్రయత్నానికి బ్రేక్ పడిందనే కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత బీజేపీలోకి గంటా వెళ్తున్నారనే ప్రచారం కూడా జరిగింది.

  • Loading...

More Telugu News