నీరవ్ మోదీ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడే.. ముంబై స్పెషల్ కోర్ట్ స్పష్టీకరణ

05-12-2019 Thu 15:47
  • న్యాయస్థానం తాజా ప్రకటనతో నీరవ్ కు పెద్ద ఎదురుదెబ్బ 
  • పీఎన్బీని 14 వేల కోట్లకు ముంచిన నీరవ్  
  • ప్రస్తుతం నార్త్ లండన్ లోని  వాన్ డ్స్ వర్త్ జైలులో ఉన్న నీరవ్
పంజాబ్ నేషనల్ బ్యాంకును 14 వేల కోట్ల రూపాయలకు ముంచి, దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఆర్థిక నేరస్తుడిగా గుర్తిస్తూ ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఓ ప్రకటనను విడుదల చేసింది. నీరవ్ మోదీ పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు (ఎఫ్ఈఓ) అంటూ అక్రమ నగదు చలామణి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం (పీఎంఎల్ఎ) తాజాగా చేసిన ప్రకటన నీరవ్ కు పెద్ద ఎదురు దెబ్బగా పేర్కొనాలి.

ఆర్థిక నేరాల్లోనే సంచలనం కలిగించిన నీరవ్ మోదీ కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంకు 14 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ కుంభకోణం భయటపడుతుందనగా నీరవ్ లండన్ కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై ఆయన్ను తమకు అప్పగించాలంటూ భారత దేశం బ్రిటన్ కు పలుమార్లు విన్నవించింది. దీనికి స్పందించిన అక్కడి ప్రభుత్వం నీరవ్ ను అరెస్ట్ చేసింది. ఇక తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన ఇప్పటికే 4 సార్లు లండన్ కోర్టుకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆయన నార్త్ లండన్ లోని వాన్ డ్స్ వర్త్ జైలులో ఉన్నారు.