Janasena: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సినీ నటుడు సుమన్ విమర్శలు

  • రెండు బెత్తం దెబ్బలు చాలన్న వ్యాఖ్యలపై విమర్శ
  • పవన్ ఇలా మాట్లాడటం దారుణం
  • అలాంటి ఘటనలు వారి ఇంట్లో జరిగితే ఇలానే మాట్లాడతారా?
అత్యాచారం చేసిన నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలను సినీ నటుడు సుమన్ ఖండించారు. పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. అలాంటి ఘటనలు వారి ఇంట్లో జరిగితే ఇలానే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని సూచించారు. దిశ అత్యాచార ఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Janasena
Pawan Kalyan
Hero
Suman

More Telugu News