1984 sikh rides: మన్మోహన్ వ్యాఖ్యలు సమర్థనీయమైనవి కావు: పీవీ మనవడు సుభాష్ కౌంటర్

  • గుజ్రాల్ సూచన పాటించి ఉంటే మరింత సమస్యయ్యేది 
  • దూరదృష్టితోనే పీవీ దాన్ని తిరస్కరించి ఉంటారు 
  • కేబినెట్ నిర్ణయం లేకుండా మంత్రులు అలా నిర్ణయించగలరా?

ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో దేశవ్యాప్తంగా జరిగిన సిక్కుల ఊచకోతలకు అప్పటి హోంమంత్రి పి.వి.నరసింహారావు తప్పుడు నిర్ణయమే కారణమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను ఆయన మనవడు, బీజేపీ నాయకుడు ఎన్.వి.సుభాష్ తప్పుపట్టారు.

మన్మోహన్ వ్యాఖ్యలు సమర్థించేవిగా లేవని, పీవీ కుటుంబ సభ్యునిగా ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. సిక్కులపై దాడులు జరుగుతున్నప్పుడు ఆర్మీని రంగంలోకి దించాలని అప్పటి హోంమంత్రి పీవీకి గుజ్రాల్ సూచించినా ఆయన పట్టించుకోలేదని, అందువల్లే దురదృష్టకర పరిణామాలు జరిగాయని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఈ నేపధ్యంలో సుభాష్ మాట్లాడుతూ పీవీ దార్శనికుడని, ఆయన దూరదృష్టితోనే వ్యవహరించి ఉంటారని అన్నారు. అప్పట్లో గుజ్రాల్ మాటలు విని ఆర్మీని రంగంలోకి దించి ఉంటే పెద్ద విపత్తు జరిగేదన్నారు. అయినా కేబినెట్ అనుమతి లేకుండా ఏ మంత్రి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరని మన్మోహనకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News