Sanjana: ఆశీష్ తో రాజీ చేసుకోవాలని 'పెద్దల' ఫోన్స్... సమస్యేలేదన్న సినీ నటి!

  • ఐదు రోజుల నాడు పబ్ లో ఘటన
  • ఆశీష్ వేధించాడని పోలీసులకు ఫిర్యాదు
  • రాజీకి ససేమిరా అంటున్ననటి
ఐదు రోజుల నాడు హైదరాబాద్ లోని ఓ పబ్బులో తనతో అసభ్యంగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ తో రాజీ చేసుకోవాలని కొందరు రాజకీయ నాయకుల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అయితే, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సినీ నటి స్పష్టం చేసింది.

ఈ కేసులో పోలీసులు సైతం చర్యలు తీసుకోవడం లేదని, తాను సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించాలని సూచిస్తే, ఆ పని చేయలేదని ఆరోపించిన సదరు నటి, కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తనను సంప్రదించి, రాజీ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పింది. కాగా, హైదరాబాద్, హైటెక్స్ నోవాటెల్ హోటల్ పబ్ లో తన పట్ల ఆశీష్ అమర్యాదగా ప్రవర్తించాడని, మొదటి అంతస్తుపై నుంచి తోసేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.
Sanjana
Asish Goud
Police

More Telugu News