England: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ కన్నుమూత!

  • 70 ఏళ్ల వయసులో అనారోగ్యం
  • చికిత్స పొందుతూ మృతి
  • సంతాపం తెలిపిన క్రీడాలోకం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బాబ్ విల్లిస్ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విల్లీస్, నిన్న మరణించారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతితో క్రికెట్ అభిమానుల్లో విషాదం నెలకొంది. పలువురు క్రికెట్ ప్రముఖులు విల్లీస్ మరణం పట్ల సంతాపాన్ని తెలిపారు. కాగా, 1971లో క్రికెట్‌ కెరీర్ ను ప్రారంభించిన ఆయన, 90 టెస్టులు, 64 వన్డేల్లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 325 వికెట్లు తీసుకున్నారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక చాలాకాలం పాటు కామెంటేటర్ గా పనిచేశారు.
England
Bob Willies
Passes Away

More Telugu News