Nirmala sitaraman: నిర్మలా సీతారామన్ పై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన అధిర్ రంజన్ చౌదరి

  • ‘నిర్బల సీతారామన్’గా అభివర్ణించిన అధిర్ రంజన్
  • రెండురోజుల క్రితం చేసిన ఈ వ్యాఖ్యలపై నేడు క్షమాపణ
  • నిర్మలా సీతారామన్ నాకు అక్కతో సమానం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారు. నిర్మలా సీతారామన్ అనడానికి బదులుగా ‘నిర్బల సీతారామన్’ అనడం సరైందేమోనంటూ రెండు రోజుల క్రితం లోక్ సభ లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీతో పాటు మిగిలిన రాజకీయపార్టీల నేతలు ఆయనపై విమర్శలు గుప్పించడంతో ఎట్టకేలకు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇవాళ లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, నిర్మలా సీతారామన్ తనకు అక్కతో సమానమని, ఆమెకు తాను తమ్ముడి లాంటి వాడినని అన్నారు.
Nirmala sitaraman
Adhir ranjan chowdary
Congress

More Telugu News