pG Exams Writtern by Vaira MLA Ramulu Naik: పీజీ పరీక్షలు రాసిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్

  • తొలి సంవత్సరం పరీక్షలకు హాజరు
  • మిగతా విద్యార్థులతో కలిసి పరీక్ష రాసిన ఎమ్మెల్యే
  • డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మాధ్యమంగా పీజీ చేస్తోన్న నాయక్
చదువుకు హోదా, వయసు అడ్డురాదని నిరూపించారు ఖమ్మం జిల్లాకు చెందిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో ఆయన పీజీ చదువుతున్నారు. ఈ రోజు ఆయన జిల్లాలోని ఎస్ ఆర్ ఆండ్ బీజీఎన్ఆర్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. విద్యార్థులతో పాటే కూర్చుని ఆయన పరీక్ష రాయటం విశేషం. పరీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీజీ చదవాలనేది తన చిరకాల కోరిక అని చెప్పారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మాధ్యమంగా పీజీ చేస్తూ..తన కోరికను తీర్చుకుంటున్నానని అన్నారు.
pG Exams Writtern by Vaira MLA Ramulu Naik
Telangana

More Telugu News