In the Parliament compound minister peyush goel Run: సమావేశాలకు ఆలస్యమవుతోందంటూ.. పరుగెత్తిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

  • పార్లమెంట్ ఆవరణలో అందరినీ ఆకర్షించిన దృశ్యం  
  • వైరల్ గా మారిన మంత్రి పరుగెత్తుతున్న ఫొటోలు
  • మంత్రి సమయ పాలనను ప్రశంసిస్తూ ట్వీట్లు
ఈ రోజు పార్లమెంట్ ప్రాంగణంలో మంత్రి పరుగులు తీసిన దృశ్యం అందరినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ కారులోంచి దిగడమే తరువాయి.. సభలోకి పరుగెత్తారు.

ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సమయం మించిపోతుందన్న కారణంతో మంత్రి పరుగు తీయడాన్ని పలువురు అభినందిస్తూ ట్వీట్లు పెట్టారు. మరి కొంతమంది 'బుల్లెట్ రైలు కన్నా వేగంగా పరుగెత్తుతున్న వ్యక్తి ఎవరో గుర్తించండి' అంటూ కామెంట్లు పెట్టారు.
In the Parliament compound minister peyush goel Run
To Attend in the ongoing winter sessions

More Telugu News