Telugudesam: వైసీపీ ప్రభుత్వం టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తోంది: చంద్రబాబు

  • చాలా నియోజకవర్గాల్లో వేధింపులకు గురిచేస్తున్నారు
  • మా పార్టీ శ్రేణులు స్తబ్ధుగా ఉన్నప్పటికీ.. వాళ్లే వచ్చి దాడిచేయడం బాధాకరం
  • పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ పాలనపై మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చాలా నియోజక వర్గాల్లో తమ పార్టీ నేతలపై వేధింపులు పెరిగాయన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ రోజు పాణ్యంలో మీడియాతో మాట్లాడారు.

‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 9 జిల్లాల్లో పర్యటించాను. 123 నియోజకవర్గాల్లో పర్యటన పూర్తి కావస్తోంది. ఇంకో 52 నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కన్పిస్తోంది. కొత్తగా ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోంది. ఒక టెర్రరిస్ట్ స్టేట్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వీళ్లు ప్రవర్తించారు.

వైసీపీ వైఖరిని చూసి మా పార్టీ శ్రేణులు స్తబ్ధుగా ఉన్నప్పటికి.. వాళ్లే వచ్చి దాడిచేయడం బాధాకరం, కొన్ని పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని కేసు కూడా ఇవ్వరాదని మాట్లాడారు. ఒకవేళ కేసు ఇస్తే దాన్ని బెయిలబుల్ కింద పెట్టారు. అవతలి వాళ్లు మాపై కేసు పెడితే దాన్ని నాన్ బెయిలబుల్ కేసుగా నమోదుచేసి మా వాళ్లను అరెస్టు చేస్తున్నారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. 

More Telugu News