Ravi Kishan: భారత్ ముమ్మాటికీ హిందూ దేశమే: రవి కిషన్

  • దేశంలో హిందువుల జనాభా 100 కోట్లు ఉంది
  • ప్రపంచంలో ఎన్నో క్రిస్టియన్, ముస్లిం దేశాలు ఉన్నాయి
  • మనకు భారత్ ఉండటం అద్భుతం
ప్రముఖ సినీ నటుడు, గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ, మన దేశంలో హిందువుల జనాభా 100 కోట్లని... అందువల్ల ఈ దేశం ముమ్మాటికీ హిందూ దేశమేనని అన్నారు. ప్రపంచంలో ఎన్నో క్రిస్టియన్, ముస్లిం దేశాలు ఉన్నాయని... మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా ఉంచుకునేందుకు మనకు 'భారత్' ఉండటం అద్భుతమని అన్నారు. రవికిషన్ వ్యాఖ్యలపై కొందరు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Ravi Kishan
BJP
Tollywood
Bharat

More Telugu News