Chidambaram: మా నాన్న రేపు పార్లమెంటులో ఉంటారు: కార్తీ చిదంబరం

  • చిదంబరంకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • 105 రోజులపాటు తీహార్ జైల్లో ఉన్న చిద్దూ
  • తమిళనాడు నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిదంబరం

ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరంకు ఈరోజు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కార్తీ చిదంబరం మీడియాతో మాట్లాడుతూ, రేపు ఉదయం 11 గంటలకల్లా తన తండ్రి పార్లమెంటులో ఉంటారని చెప్పారు. ఇప్పటికే తన తండ్రితో తాను మాట్లాడానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ తరపున తమిళనాడు నుంచి రాజ్యసభకు చిదంబరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 105 రోజుల పాటు ఢిల్లీలోని తీహార్ జైల్లో గడిపిన చిదంబరం ఈరోజు బయటకు రానున్నారు. మరోవైపు, బెయిల్ పై విడుదలవుతున్న చిదంబరంకు సుప్రీంకోర్టు కొన్ని షరతులను విధించింది. తమ అనుమతి లేనిదే విదేశాలకు వెళ్లకూడదని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని కండిషన్లు పెట్టింది. కేసుకు సంబంధించి పబ్లిక్ స్టేట్ మెంట్లు ఇవ్వరాదని, సాక్షులను కలవరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని ఆదేశించింది.

More Telugu News