shiv sena: కుట్ర జరిగింది.. బీజేపీ ఉచ్చులో శరద్ పవార్ పడలేదు: శివసేన నేత సంజయ్ రౌత్

  • బీజేపీపై సంజయ్ రౌత్ ఆరోపణలు
  • మహారాష్ట్రలో శివసేనను లేకుండా చేయాలనుకున్నారు 
  • ఈ కుట్రలో శరద్ పవార్ ను కూడా భాగస్వామిని చేయాలనుకున్నారు
బీజేపీపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహారాష్ట్రలో తమ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేసిందని చెప్పారు. ఈ కుట్రలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా భాగస్వామిని చేయాలని బీజేపీ ప్రయత్నాలు కొనసాగించిందని, అయితే, ఆయన బీజేపీ ఉచ్చులో పడలేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కాగా, మహారాష్ట్రలో పలు నాటకీయ పరిణామాల అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  
shiv sena
Maharashtra
BJP

More Telugu News