Disha: 'దిశ' ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం

  • హోం మంత్రి మహమూద్ అలీ కార్యాలయంలో సమావేశం
  • పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్
  • భద్రత, అప్రమత్తతలపై అవగాహన కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయం 
దిశ ఘటన నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహిస్తోంది. హైదరాబాద్, లక్డీకాపూల్ లోని హోం మంత్రి మహమూద్ అలీ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పోలీసు, విద్య, మహిళా సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. భద్రత, అప్రమత్తతలపై మహిళలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంచలనం రేపిన దిశ లాంటి ఘటన మరోసారి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చిస్తున్నారు. యువతలో క్రూర ప్రవర్తన లేకుండా చేయడానికి విద్యా బోధనలో నైతిక విలువల వంటి వాటిపై కూడా చర్చిస్తున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కాసేపట్లో మీడియాకు వివరాలు తెలిపే అవకాశం ఉంది.
Disha
mahmood ali
Telangana

More Telugu News