Kerala: ఆకలికి తాళలేక మట్టితిన్న చిన్నారులు!

  • కేరళలోని తిరువనంతపురంలో ఘటన
  • రైల్వే వంతెన కింద పిల్లలతో కలిసి ఉంటోన్న తల్లి  
  • స్పందించిన అధికారులు
  • ఆ తల్లికి తిరువనంతపురంలో ఉద్యోగం

ఆ చిన్నారులు ఆకలి బాధ తట్టుకోలేకపోయారు.. మట్టిని తింటూ కనపడ్డారు. విస్మయానికి గురి చేసిన ఈ ఘటన ఎక్కడో మారు మూల గ్రామంలో జరగలేదు. కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలుగులోకొచ్చింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ పిల్లలకు కనీసం అన్నం కూడా దొరకని పరిస్థితి. శ్రీదేవి అనే మహిళ కేరళలోని తిరువనంతపురంలో ఓ రైల్వే వంతెన కింద తన ఆరుగురు పిల్లలతో కలిసి ఉంటోంది. ఆ పిల్లలంతా ఏడేళ్లలోపు వారే.

ఈ క్రమంలోనే అకలి బాధను తాళలేక మట్టితిన్న పిల్లలను చూసి స్థానికులు చలించిపోయారు. పిల్లలను పెంచే స్తోమత లేదని బాలల సంరక్షణ కమిటీకి శ్రీదేవి ఇప్పటికే ఓ లేఖ రాసింది. దీనిపై స్పందించిన అధికారులు ఆమెకు తిరువనంతపురంలో ఉద్యోగం ఇచ్చారు. ఆ పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టి ఆదుకుంటున్నారు. ఆ పిల్లల తండ్రి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడని, కుటుంబాన్ని పట్టించుకోడని తెలిసింది. అంతేగాక, మద్యం తాగి వచ్చి భార్యాపిల్లలను కొడుతుంటాడని స్థానికులు చెప్పారు.

More Telugu News