Jayanthi: సీనియర్ హీరోయిన్ జయంతి అలా షాక్ ఇచ్చారట!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన అలనాటి కథానాయికలలో జయంతి ఒకరు. కథానాయికలకి గట్టి పోటీ వున్న సమయంలో ఆమె తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి జయంతిని గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు.

"పేకేటి శివరామ్ మంచి రచయిత .. హాస్యనటుడు కూడా. అలాంటి ఆయన తన భార్యగా 'జయంతి'గారిని నాకు పరిచయం చేశారు. అప్పటికే ఆయనకి పెళ్లైంది .. ఎనిమిది మంది పిల్లలు కూడా. పేకేటి శివరామ్ కి .. జయంతిగారికి మధ్య వయసు తేడా కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఈ పెళ్లికి ఆమె ఎలా ఒప్పుకున్నారా అని నేను ఆశ్చర్యపోయాను. ఆ తరువాత కాలంలో జయంతిగారు స్టార్ హీరోయిన్ అయ్యారు. అప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి ఆమె ఇంటికి వెళ్లాను. అప్పుడు ఆమె 'మావారు' అంటూ మరో వ్యక్తిని పరిచయం చేయడంతో షాక్ అయ్యాను. ఆయన నిర్మాత 'గిరిబాబు' .. అంతకుముందు జయంతిగారితో 'చందన' అనే సినిమాను నిర్మించారు" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Jayanthi

More Telugu News