Crime News: యువతి స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ.. గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

  • నాలుగు నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు 
  • నిందితుడు ఫరూక్ అరెస్టు
  • బంజారాహిల్స్ స్టేషన్ పరిధిలో ఘటన

పక్కింటి యువతి స్నానం చేస్తుండగా కిటికీలోనుంచి వీడియో తీసేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు..


బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో నివసించే యూసుఫ్ ఫరూక్ (19) పొరుగింటిలో కొందరు యువతులు నివసిస్తున్నారు. వీరిలో ఓ యువతి నిన్న స్నానం చేసేందుకు బాత్ రూంలోకి వెళ్లింది. దీన్ని గుర్తించిన యూసుఫ్ బాత్ రూం కిటికీ వద్దకు వెళ్లి ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీయాలని ప్రయత్నించాడు. దీన్ని గమనించిన ఆ యువతి వెంటనే అప్రమత్తమై 100 నంబరుకు డయిల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన నాలుగు నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యూసుఫ్ ను అరెస్టు చేసి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

Crime News
Hyderabad
bathroom scenes
vedio
one arrest

More Telugu News