Tirumala: ఎమ్మెల్సీ విజయరామరాజు పేరిట తిరుమలలో అక్రమ టికెట్ల దందా... పట్టేసిన నిఘా వర్గాలు!

  • అధిక ధరలకు టికెట్ల విక్రయం
  • హేమంత్ కుమార్ అనే వ్యక్తి అరెస్ట్
  • మరో వ్యక్తి కోసం గాలింపు
తిరుమలలో సాగుతున్న మరో అక్రమ టికెట్ల దందాను నిఘా వర్షాలు పట్టేశాయి. ఏపీ ఎమ్మెల్సీ విజయరామరాజు పేరిట ఉన్న సిఫార్సు లేఖలతో కొందరు వ్యక్తులు అధిక ధరలకు సేవ, దర్శనం టికెట్లను విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా వీరి దందా సాగుతుండగా, దీన్ని పసిగట్టిన అధికారులు, దాడి చేసి హేమంత్ కుమార్ అనే దళారీని అరెస్ట్ చేశారు.

సిఫార్సు లేఖలను తీసుకుని వచ్చి హేమంత్ కు ఇచ్చే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. తిరుమలలో టికెట్ల దందాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని, భక్తులు సక్రమ మార్గంలోనే స్వామి దర్శనానికి వెళ్లాలని, దళారులను నమ్మి కష్టాలు కొని తెచ్చుకోవద్దని టీటీడీ అధికారులు సూచించారు.
Tirumala
Tirupati
Vijayarama Raju
Tickets

More Telugu News