New benj car Release: సరికొత్త జీఎల్సీ ఎస్ యూవీ బెంజ్ కార్ విడుదల

  • జెనీవా 2019 మోటార్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన
  • భారత మార్కెట్లో ధరల రేంజ్ రూ.52.75 లక్షల నుంచి రూ.57.75 లక్షలు  
  • అలాయ్ వీల్స్ 17 నుంచి 19 అంగుళాల వేరియేషన్స్ లో లభ్యం

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సరికొత్త జీఎల్సీ ఎస్ యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. జెనీవా మోటార్ ఎగ్జిబిషన్లో దీన్ని ప్రదర్శించారు. భారత మార్కెట్లో దీని ధర రేంజ్ రూ.52.75 లక్షల నుంచి రూ.57.75 లక్షల వరకు ఉంటుంది. పాత ఎస్ యూవీతో పోలిస్తే.. దీన్లో చాలా మార్పులు చేశారు. బీఎస్ 6 డీజిల్, పెట్రోల్ ఇంజిన్లను అమర్చారు. భారత్ మార్కెట్లో తొలిసారిగా ఎంబక్స్ ఇంటర్ ఫేజ్ వ్యవస్థతో అడుగుపెట్టిన కారు ఇదే.

జీఎల్సీ 200, జీఎల్సీ 220 డి 4 మాటిక్ ఆప్షన్లలో దొరుకుతుంది. కారుకు అలాయ్ వీల్స్ 17 నుంచి 19 అంగుళాల వేరియేషన్స్ లో లభ్యమవుతాయి. ఎంబక్స్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్స్ క్లస్టర్ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్, టచ్ స్క్రీన్ యూనిట్, భారీ టచ్ ప్యాడ్ తో పాటు స్టీరింగ్ టచ్ సెన్సిటివ్ బటన్స్ కూడా ఉన్నాయి. కొత్త జనరేషన్ 4 సిలిండర్ బీఎస్ 6 పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు అమర్చారు. పెట్రోల్ రకానికి ఎం264 2.0 లీటర్  ఇంజిన్ ను అమర్చారు. డీజిల్ మోడల్ కు ఓఎం 651 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజిన్ను అమర్చారు.

More Telugu News