Banglore: మహిళల భద్రత కోసం బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం

  • మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లేందుకు అనుమతి
  • ఇప్పటివరకు పెప్పర్ స్ప్రే బాటిళ్లను అనుమతించని వైనం
  • దిశ ఘటన నేపథ్యంలో మెట్రో నిర్ణయం
దిశ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మహిళల భద్రత అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనేక రాష్ట్రాలు స్త్రీల రక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించాయి. తాజాగా, బెంగళూరు మెట్రో రైల్ వ్యవస్థ మహిళల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట మహిళలు మెట్రో రైళ్లలో ప్రయాణించేటప్పుడు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకువెళ్లేందుకు అనుమతించింది. ఇప్పటివరకు మెట్రోల్లో పెప్పర్ స్ప్రే బాటిళ్లకు అనుమతి లేదు. కానీ, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండడంతో ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని బెంగళూరు మెట్రో యాజమాన్యం భావిస్తోంది.
Banglore
Metro
Pepper Spray
Disha
Telangana
Hyderabad

More Telugu News