Janasena: ‘జనసేన’ మిత్రపక్షంగా ఉన్నా లేక విలీనం చేసినా సంతోషమే: బీజేపీ నేత రఘనాథబాబు

  • 2014లో పవన్ కల్యాణ్ మాకు మిత్రుడే
  • పవన్ దృష్టిలో జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం
  • జగన్ పాలనలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదు

జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారేమో అంటూ వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత రఘనాథబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. జనసేన పార్టీ వస్తే విలీనం చేసుకోవడానికి తాము సిద్ధంగా వున్నామని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పవన్ ఉద్దేశ్యం ప్రకారం ‘జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెయిల్యూర్ సీఎం’, ఎందుకంటే, జగన్ ఆరు నెలల పాలనలో నిర్మాణాలకు సంబంధించి ఒక్క పనీ జరగకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, అటువంటి పరిస్థితుల్లో బతకడం ఎలా? అని ప్రశ్నించారు.

బీజేపీ వైపు పవన్ మొగ్గుచూపుతున్నారంటూ వస్తున్న వార్తలపై రఘునాథబాబు స్పందిస్తూ, 2014లో పవన్ కల్యాణ్ తమకు మిత్రుడే అని, మళ్లీ తమతో కలిస్తే సంతోషమేనని, తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పారు. ‘జనసేన’ తమకు మిత్రపక్షంగా ఉన్నా లేక బీజేపీలో విలీనం చేస్తామన్నా సంతోషకరమైన విషయమేనని, అందుకు తాము సిద్ధంగా వున్నామని స్పష్టం చేశారు.

More Telugu News