YCP MLA Sridevi criticism against Chandra babu naidu: రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదు: వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

  • కౌలు ఇస్తానని చెప్పి రైతులను దగా చేశారు
  • ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు
  • 13 దేశాలు పర్యటించి.. ఖజానాను దుర్వినియోగం చేశారు
ఏపీ రాజధానిని కట్టేందుకు గ్రాఫిక్స్ పేర వృథాగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధ్వజమెత్తారు. ఈ నెపంతో13 దేశాలు పర్యటించారన్నారు. 28 సార్లు టూర్లు చేసి ఖజానాను దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. రైతులను మభ్యపెట్టి అసెన్డ్ భూములను లాక్కున్నారని విమర్శించారు.  ఆమె ఈ రోజు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. రైతులు ఉచితంగా భూమిలిచ్చారని చెబుతున్నారు. అది అబద్ధం. కౌలు ఇస్తానని చెప్పి భూములు తీసుకుని రైతులను మీరు మోసం చేశారు. మీ అనుంగులు ఆ భూములను కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మీకు ఇష్టమైన కంపెనీలకు ఆ భూములను ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి అమరావతికి పారిపోయి వచ్చారు. నాణ్యతలేకుండా అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ కట్టించారు. అసెంబ్లీ నిర్మాణంలో కోట్ల రూపాయలు దోచుకున్నారు’ అని అమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
YCP MLA Sridevi criticism against Chandra babu naidu

More Telugu News