Apco: మన ఆప్కో వస్త్రాలు ఇక నుంచి ప్రపంచమంతా అందుబాటులో ఉంటాయి: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి

  • అమెజాన్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
  • అమెజాన్ లో చేనేత వస్త్రాల విక్రయం
  • చేనేత బ్రాండ్ విలువ పెరుగుతుందన్న మంత్రి
రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆప్కో ద్వారా విక్రయించే వస్త్రాలను ఇకపై ఆన్ లైన్ లోనూ విక్రయించనున్నారు. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇక నుంచి ఆప్కో వస్త్రాలు ప్రపంచమంతటా అందుబాటులో ఉంటాయని తెలిపారు. అమెజాన్ లోనూ ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేయవచ్చని అన్నారు. చేనేత బ్రాండ్ విలువను పెంచేందుకు అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి వివరించారు. ఆప్కో బ్రాండ్ ద్వారా మన నేతన్నలకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.
Apco
Andhra Pradesh
YSRCP
Jagan
Mekapati Gowtham Reddy

More Telugu News