Amaravathi: అమరావతి ఘటనపై గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు

  • రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు
  • పోలీసుల కుట్రతోనే కాన్వాయ్ పై దాడి జరిగింది
  • ఈ విషయాన్నే గవర్నర్ కు ఫిర్యాదు చేశాం: అచ్చెన్నాయుడు
ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల పర్యటించిన సమయంలో కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తున్న టీడీపీ నేతలు, విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పోలీసుల కుట్రతోనే చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగిందన్న విషయాన్ని గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అమరావతిలో చంద్రబాబు పర్యటనపై పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ వైసీపీ రౌడీలను అడ్డుకోలేకపోయారని ఆరోపించారు.
Amaravathi
Rajbhavan
Governer
Telugudesam

More Telugu News