Crime News: వరంగల్ లో కలకలం.. గుర్తు తెలియని యువతి మృతదేహం గుర్తింపు

  • కాజీపేట మండలం వడ్డేపల్లి చెరువు వద్ద ఘటన
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • పలు అంశాలపై ఆరా తీస్తోన్న పోలీసులు

వరంగల్ అర్బన్ జిల్లాలో గుర్తు తెలియని యువతి మృతదేహం పడి ఉండడం కలకలం రేపింది. కాజీపేట మండలం వడ్డేపల్లి చెరువులో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను ఎవరైనా హత్య చేసి, చెరువులో పడేశారా? ఆత్మహత్య చేసుకుందా? వంటి అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్ శివారులో దిశ హత్య కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News