Jasmin: అక్కడ కిలో మల్లెపూలు కేవలం రూ. 3 వేలు!

  • భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి
  • తమిళనాడులో ఆకాశానికి మల్లెల ధర
  • వారం రోజుల వ్యవధిలో రెట్టింపు

తమిళనాడులో కిలో మల్లెపూల ధర ఏకంగా రూ. 3 వేలకు చేరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వారం క్రితం రూ. 1500-1800 మధ్య ఉన్న ధర ఇప్పుడు రెట్టింపైంది. మరోవైపు పెళ్లిళ్లు జరుగుతూ ఉండటంతో మల్లెపూలకు డిమాండ్ అధికంగా ఉందని, ఇదే సమయంలో సరఫరా తగ్గడంతోనే పూల ధరలు చుక్కలను అంటుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. సాధారణంగా మార్కెట్ కు వచ్చే పూలలో సగం కూడా రావడం లేదని శరవణ కుమార్ అనే వ్యాపారి వెల్లడించాడు. రోజుకు ఐదు నుంచి ఆరు కిలోల పూలను విక్రయించే వారు నేడు రెండు కిలోల అమ్మకాలకు కూడా నోచుకోవడం లేదని వాపోయాడు.

More Telugu News