Vijay Sai Reddy: రాజకీయాలంటే ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం కాదు: పవన్ పై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు

  • యాక్టరును చూద్దామని నలుగురు పోగవుతున్నారు
  • రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు
  • రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు 
ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయినప్పటికీ సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన అమ్ముడుపోయారంటూ ఆరోపణలు గుప్పించారు.

'ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురూ పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదు' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Pawan Kalyan

More Telugu News