Rajasthan: 'దిశ' కోసం... 3,200 కి.మీ ఒంటరి ప్రయాణాన్ని తలపెట్టిన యువతి!

  • రాజస్థాన్ కు చెందిన నీతూ చోప్రా
  • ఆడవాళ్లను ఇంటికే పరిమితం చేయరాదు
  • దిశ హంతకులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదమని వెల్లడి

మహిళలకు భద్రత లక్ష్యంగా ఓ యువతి 3,200 కిలోమీటర్ల ఒంటరి ప్రయాణాన్ని చేయాలని నిర్ణయించుకుంది. ఇండియాలో జరుగుతున్న హత్యాచార ఘటనలను సాకుగా చూపించి, ఆడవాళ్లను ఇంటికి మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచన సరికాదంటున్న రాజస్థాన్, ఉదయ్ పూర్ కు చెందిన నీతూ చోప్రా (28), బలోత్రా నుంచి కన్యాకుమారి వరకూ ఒంటరిగా స్కూటర్ పై వెళ్లాలని నిర్ణయించారు.

 హైదరాబాద్ లో జరిగిన 'దిశ' ఉదంతంపై స్పందించిన ఆమె, హంతకులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకారులని అన్నారు. తాను ఓ సైనికురాలినని అనుకుంటున్నానని, ఒంటరి ప్రయాణానికి భయపడబోనని, మధ్యలో వెనుకడుగు వేయనని అన్నారు. దిశ హంతకులకు వ్యతిరేకంగా పోరాటమే తన లక్ష్యమని నీతూ చోప్రా తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఈ యాత్రను తలపెట్టానని చెప్పారు.

More Telugu News