Moon: చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించిన నాసా... ఫొటోలు విడుదల!

  • గుర్తించిన లూనార్ రికొన్నైస్పాన్ ఆర్బిటర్
  • కిలోమీటర్ పరిధిలో శకలాలు
  • 24 ముక్కలు కనిపిస్తున్నాయన్న నాసా

చంద్రుడి దక్షిణ ధ్రువంలో కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపైకి పంపితే, అది కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇన్నాళ్లూ చీకటిగా ఉండటంతో ల్యాండర్ జాడను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఇక ఆ ప్రాంతానికి వెలుగు రావడంతో ల్యాండర్ ను కనిపెట్టిన నాసా, ఆ ఫోటోలను విడుదల చేసింది.

సెప్టెంబర్ 26న ఏ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ కూలిందో గుర్తించామని, లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) ల్యాండర్‌ ను గుర్తించిందని నాసా పేర్కొంది. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడ్డాయని, 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని తెలిపింది.

More Telugu News