KTR: కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ.. మండిపడిన కేటీఆర్!

  • ఆర్టీసీలోని మహిళా కార్మికులకు రాత్రి 8 గంటల వరకే విధులన్న కేసీఆర్
  • ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా? అన్న రేఖాశర్మ
  • వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్న కేటీఆర్

ఆర్టీసీలోని మహిళా కార్మికులకు రాత్రి 8 గంటల వరకే విధులు కేటాయించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మకు కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. మహిళలు రాత్రి ఎనిమిది గంటలలోపు ఇంట్లో ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొనడం సరికాదని, ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా? అని రేఖాశర్మ ప్రశ్నించారు. మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయన్న సంగతిని గుర్తెరగాలని సూచించారు.

రేఖాశర్మ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఏది పడితే అది మాట్లాడడం తగదని హితవు పలికారు. తమకొచ్చిన సమాచారాన్ని పరిశీలించాలని, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

More Telugu News