Chandrababu: చంద్రబాబు బస్సుపై దాడి ఘటనను కేంద్ర హోం శాఖ దర్యాప్తు చేయాలి: కళా వెంకట్రావు

  • కాన్వాయ్ పై  దాడి ఘటనపై మండిపాటు
  • నిరసనలు తెలిపేందుకు పోలీసులే అనుమతి ఇస్తారా?
  • గతంలో చంద్రబాబును గృహనిర్బంధం చేశారు
ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో చంద్రబాబు బస్సుపై జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్టు టీడీపీ నేత కళా వెంకట్రావు తెలిపారు. టీడీపీ గతంలో నిర్వహించిన ‘ఛలో ఆత్మకూరు’ సందర్భంలోనూ చంద్రబాబును గృహనిర్భంధం చేశారని విమర్శించారు. చంద్రబాబు పర్యటన సమయంలో నిరసనలు తెలిపేందుకు పోలీసులే అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కళా వెంకట్రావు, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Chandrababu
kalavenkatrao
Amaravathi
convoy

More Telugu News