Anushka Shetty: 'నిశ్శబ్దం' విడుదల తేదీ ఖరారు

  • అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం'
  • కీలకమైన పాత్రలో హాలీవుడ్ నటుడు 
  •  అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు  
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం' సినిమా రూపొందింది. థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది. పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరించబడిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు.

జనవరి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అనుష్క భర్త పాత్రలో మాధవన్ నటించగా, అంజలి .. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కీలకమైన పాత్రను పోషించాడు. 'భాగమతి' తరువాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు వున్నాయి. అనుష్క అభిమానులంతా ఈ సినిమా కోసమే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Anushka Shetty
Anjali
Shalini

More Telugu News